
కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. తమ పార్టీని వీడిన 12 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పారు. హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేసీఆర్ కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.