
దేశంలో కరోనా టీకాల కొరతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీకాల సరఫరా గురించి కేంద్రం చేసిన ప్రకటనను రాహుల్ అర్థం చేసుకోలేకపోతున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జూలై నెలలో వ్యాక్సిన్ లభ్యత గురించి నిన్ననే నేను ప్రకటన చేశాను. అయినా రాహుజీ సమస్య ఏంటో? ఆయన చదవలేరా లేదా అర్ధం కాలేదా? అహంకారం, నిర్లక్ష్యం వంటి వైరస్ లకు ఎలాంటి టీకా లేదు. నాయకత్వ మార్పుల గురించి కాంగ్రెస్ ఆలోచించాల్సిందే అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు.