Homeటాప్ స్టోరీస్Harish Rao : హరీష్ రావు సైలెంట్.. వెబ్ సైట్ షట్ డౌన్.. ఏం జరిగింది.....

Harish Rao : హరీష్ రావు సైలెంట్.. వెబ్ సైట్ షట్ డౌన్.. ఏం జరిగింది.. ఏమైంది..

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడంటే కేటీఆర్ చుట్టూ వ్యవహారాలు సాగుతున్నాయి గాని.. ఒకప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. పార్టీకి విజయాలు కావలసి వచ్చినప్పుడు.. అందరి చూపు హరీష్ రావు మీద ఉండేది. కెసిఆర్ ఒక దశలో పార్టీ వ్యవహారాలు మొత్తం హరీష్ రావుకి అప్పగించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. రెండు పర్యాయాలు అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. హరీష్ రావు మాత్రమే ట్రబుల్ షూటర్ గా కనిపించేవారు.

ఒక దశలో హరీష్ రావు లేకుండా ఎన్నికలకు వెళ్తే పార్టీకి ఓటమి తప్పదని కార్యకర్తలు అనుకునేవారు. అంతటి స్థాయిని సంపాదించుకున్నారు హరీష్ రావు. అయితే ఇప్పుడు హరీష్ రావు తెలంగాణ రాజకీయాలలో డిఫెన్స్ లో పడ్డట్టు కనిపిస్తోంది. హరీష్ రావు సతీమణి తన్నీరు శ్రీనిత ఆర్వైస్ నేచర్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఈ కంపెనీ మిల్చి మిల్క్ పేరుతో పాలను విక్రయిస్తూ ఉంటుంది.

పాలను విక్రయించడం వరకు ప్రతిగా ఇబ్బందులేదు. ఈ బ్రాండ్ కు బహిరంగ మార్కెట్లో వాటా నామమాత్రంగా ఉంది. పెద్ద పెద్ద మిల్కీ బ్రాండ్లు మార్కెట్లో నిలబడేందుకు సాధారణ.. మధ్యతరగతి ప్రజలు.. కిరాణా షాప్ లలో విక్రయాలు సాగిస్తూ ఉంటాయి. మార్కెట్ వాటా పెంచుకుంటాయి.

మిల్చి మిల్క్ అలా చేయడం లేదు.. ఈ పాలు కేవలం కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు ఈ కంపెనీ పాలు వెళ్తున్నాయి. ఇతరు ఉత్పత్తులు కూడా సరఫరా అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా.. రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి.. భారీగా పాల ఆర్డర్లు దక్కించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రికార్డులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దాని ప్రకారం ఈ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు.. ఇతర లావాదేవీలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా జెండాలు మారిన రాజకీయ సంబంధాలు కనిపిస్తున్నాయి. అపలో ఆసుపత్రి తోపాటు చేవెళ్ల బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇంకా కొంతమంది బిజెపి.. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రమేయం ఇందులో ఉందని తెలుస్తోంది. అయితే ఇక్కడ కేవలం ఓట్ల కోసం మాత్రమే రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. ఆ తర్వాత వ్యాపారాల విషయంలో దోస్త్ మేరా దోస్త్ అంటూ స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్సైటు అర్ధాంతరంగా కనిపించడం మానేసింది. దీంతో ఈ ఆరోపణలు నిజమే అని తెలుస్తోంది. ఇన్వెస్టర్ల వివరాలు.. ప్రమోటర్ల పేర్లు దాస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్లే వెబ్సైట్ మొత్తాన్ని క్లోజ్ చేశారని సమాచారం. అయితే ఇప్పటికే కొంతమంది గతంలో ఉన్న పాత స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గులాబీ పార్టీ.. బిజెపి.. కాంగ్రెస్ నేతల అంతర్గత స్నేహాలను బయటపెడుతున్నారు.

మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్, బిజెపి ఒకటే అని అంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ వ్యాపార స్నేహ బంధాలు కొనసాగుతున్నాయి. పైకి కత్తులు దూసుకున్నట్టు కలరింగ్ ఇస్తున్న నేతలు.. లోపల మాత్రం పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. ఇప్పటికిప్పుడు వెబ్సైట్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రాన అసలు విషయాలు తెలియకుండా పోవు. అంతేకాదు ఈ మిల్చి మిల్క్ వ్యవహారం మీద హరీష్ రావు నోరు విప్పేంతవరకు.. ఈ ప్రచారం ఆగదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular