Harish Rao: నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెకటు డిజైన్, నిర్మాణంపై ఆయన్ను కమిషన్ ప్రశ్నించనుంది. అంతకుముందు మీడియాతో మాట్లాడిన హరీశ్.. జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తానని తెలిపారు. తన వద్ద ఉన్న కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తానని తెలిపారు.