
నేడు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. మోదీకి ఆయురారోగ్యాలతో కూడిన చిరాయువును ఆ ఆదిపరాశక్తి ప్రసాదించాలి. ప్రకాశం జిల్లాలో విమానాలు అత్యవసరంగా దిగేలా రోడ్లు నిర్మించడం అభినందనీయం. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్న మోదీకి అభినందనలు. ఈ ప్రాజెక్టును ఏపీలో అమలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు అని పవన్ అన్నారు.