
హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధఈ తదితరులు దేశ ప్రజలకు మంగళవారం వరుస ట్వీట్లలో శుభాకాంక్షలు తెలిపారు. అపార కరుణ, అంకితభావానికి ప్రతీక హనుమాన్ జయంతి అని కరోనా పై జరుపుతున్న పోరాటంలో ఆంజేయుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ఓ ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ హనుమాన్ ఫోటోను జోడించి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.