బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అనవసరంగా ఉన్న పరువును పోగొట్టుకున్నాడని ఇప్పుడు ఆయన అభిమానులే తెగ ఫీల్ అయిపోతున్నారు. మొదటినుండి సల్మాన్ ఇంతే.. తనకు రాని దాన్ని చేయడానికి ప్రయత్నం చేసి.. వచ్చిన దాన్ని వదిలేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు అంటూ సల్లూ భాయ్ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు.
ఇంతకీ సల్మాన్ చేసిన నిర్వహం ఏమిటంటే.. ‘డీజే’లో అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్ ను సల్మాన్ ఖాన్ తన “సీటిమార్” సినిమాలో వేయడం. అయినా బన్నీ వేసిన స్టెప్పులను సల్మాన్ వేయాలనుకోవడం.. చివరకు వేయలేక తేలిపోవడం చకచకా జరిగిపోయాయి. నిజానికి సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా “రాధే”లో సీటీ మార్ సాంగ్ ని పెడుతున్నాడని తెలిసినప్పుడే బాలీవుడ్ సినీ మీడియా హెచ్చరించింది.
సల్మాన్ ఖాన్ కి డ్యాన్స్ రాదు అని.. అతను ఎక్కువగా ప్యాంటుకున్న బెల్ట్ ని కిందికి, పైకి ఊపే బెల్ట్ స్టెప్పులు వేయగలడు ఏమో గానీ, నిజమైన మాస్ స్టెప్ లను వేయలేడు అని, ముఖ్యంగా బన్నీలా కష్టమైన స్టెప్స్ అసలు వేయలేడు అని తేల్చి చెప్పింది. తీరా మీడియా చెప్పినట్టే జరిగింది. మొత్తానికి పాట బయటికొచ్చిన తరువాత గానీ, సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి అసలు విషయం అర్ధం కాలేదు.
మరోపక్క యాంటీ ఫ్యాన్స్ బన్నీ స్టెప్స్ ను సల్మాన్ స్టెప్స్ ను పక్కపక్కనే పెట్టి పోల్చుకుంటూ తెగ కామెడీ చేసేస్తున్నారు. పైగా సల్మాన్ స్టెప్స్ ను క్లోజ్ షాట్ లో చూస్తుంటే.. వాంతి వొస్తుంది అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. పాపం సల్మాన్ ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నాడు. అయినా ఇలా పరువు తీసుకోవడం సల్మాన్ భాయ్ కి కొత్తేమి కాదు,
ఆయన తన సినీ కెరీర్ మొదటి నుండి స్టార్ అయిన తరువాత కూడా పరువు తీసుకునే పనిని ఒక ఆనవాయితీగా పెట్టుకున్నట్టు ఉన్నాడు. మొత్తమ్మీద ‘సీటిమార్’ సాంగ్ లో ఎనర్జిటిక్ స్టెప్స్ వేయలేక 51 ఏళ్ల సల్మాన్ మొత్తానికి ముసలోడు అంపించుకున్నాడు.