
తెలంగాణలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. జూలై 18న ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చీఫ్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పరీక్షకు వారం రోజులు ముందు గురుకుల సొసైటీల వెబ్ సైట్లు నుంచి హాల్ టికెట్లు ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. మే 30న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ కరోనా తీవ్రత కారణంగా వాయిదా పడిందన్నారు.