
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ కు మాతృవియోగం కలిగింది. గవర్నర్ తమిళిసై తల్లి కృష్ణకుమారి (80) కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన కృష్ణకుమారి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి మృతితో గవర్నర్ కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు పార్థివదేహాన్ని రాజ్ భవన్ లో ఉంచనున్నారు.