
వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం పూర్తి చేశామని సీఎం జగన్ అన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండో ఏటా ఇచ్చిన మాటకే పెద్ద పీట పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ రెండేళ్లలో ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ. 95,528 కోట్లు.. పరోక్షంగా రూ. 36,197 కోట్లు జమ చేశామన్నారు. రాష్ట్రంలో ని 86 శాతం ఇళ్లకు ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందాయని సీఎం జగన్ వివరించారు.