
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (తితిదే) ప్రజా పద్దుల కమిటీ ( పీసీఏ) పరిధిలోకి తేవాలన్న గత పాలకమండలి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తెలిపారు. స్వామి కనుసన్నల్లో వేల ఏళ్లుగా తితిదే పాలన సవ్యంగా జరుగుతోందన్నారు. అలాంటి సంస్థలో ప్రభుత్వ జోక్యం అనవసరమని స్పష్టం చేశారు. తితిదే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఉండాలన్నది హిందువుల ఆకాంక్ష అని ఆయన వివరించారు. గవర్నర్ కు పీఏసీ కమిటీ నిర్ణయాన్ని తెలియజేస్తామని చెప్పారు.