
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఛైర్మన్, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ నియమించింది. సీఎం కేసీఆర్ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ గా ప్రస్తుత వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి. జానార్దన్ రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఈఎన్సీ రమావత్ ధన్ వత్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ బి. లింగరెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారి, ప్రొఫెసర్ సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ అరవెల్లి చంద్రశేఖర్ రావు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణలకు ప్రభుత్వం నియమించింది.