
తెదేపా అధినేత చంద్రబాబుతో మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్లు బుచ్చయ్య చౌదరి భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితులపై ఇటీవల గోరంట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యనేతల సంప్రదింపులతో ఆయన ఇవాళ అధిష్టానం వద్దకు వచ్చారు. గోరంట్ల వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్, జవహర్ తదితరులు ఉన్నారు.