Google Pixel 10 : ప్రీమియం ఫోన్లు కొనాలని చాలా మందికి ఉంటుంది. కానీ వాటి ధరలు చూసి వెనుకడుగు వేస్తారు. అయితే ఒక్కోసారి వీటి సేల్స్ పెంచుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. లేటేస్ట్ గా గూగుల్ పిక్సెల్ 10 పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించారు. ఈ ఫోన్ పై ఏకంగా రూ.13,000 డిస్కౌంట్ ను ప్రకటించారు. అధునాతన ఫీచర్లు, అప్డేట్ ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? ఇందులో ఉండే ఫీచర్లు ఏంటీ? పూర్తి వివరాల్లోకి వెళితె..
Google Pixel 10 మొబైల్ లో 6.3 AMOLED డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 3000 nits పీక్ బ్రైట్‌నెస్‌తో కూడిన దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కల్పించారు. ఇందులో గూగుల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన Tensor G5 చిప్‌సెట్ ను అమర్చారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌తో వస్తుంది. అంతేకాకుండా, దీనికి గూగుల్ ఏకంగా 7 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని హామీ ఇచ్చింది.
సున్నితమైన మల్టీటాస్కింగ్ కోసం గూగుల్ పిక్సెల్ 10 లో 12GB RAM తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. నాన్ ప్రో మోడల్స్‌లో మొదటిసారిగా గూగుల్ ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పరిచయం చేసింది. దీని వెనుక భాగంలో 48MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం ఉన్న 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 10.5MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఈ మొబైల్ లో 4,970mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉండగా.. దీనికి 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ పాటు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఇన్-బిల్ట్‌గా సరికొత్త AI ఫీచర్లు ఉన్నాయి. రైటింగ్ అసిస్టెన్స్, పిక్సెల్ స్టూడియో, మ్యాజిక్ క్యూ, సర్కిల్ టు సెర్చ్ మరియు ఫోటో ఎడిటింగ్ కోసం ‘ఆస్క్ ఫోటోస్’ వంటి ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్లు రోజువారీ పనులను మరింత సులువు చేస్తాయి.
ఇదిలా ఉండగా.. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ముగింపు సందర్భంగా గూగుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 10 పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. లాంచ్ సమయంలో దీని అసలు ధర రూ. 79,999 ఉండగా, ఈ ఆఫర్ లో ఏకంగా రూ. 13,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తూ రూ. 66,999 కే అమెజాన్‌లో అందుబాటులో ఉంచారు. దీనితో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై అదనపు తగ్గింపులు, బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాలు కూడా లభిస్తుండటంతో ఈ ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది.
