శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి బంగారం పట్టుబడింది. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 34 లక్షల విలువ చేసే 24 క్యారట్స్ బంగారాన్ని గొలుసు రూపంలో తెచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.