
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర ఇవాళ స్థిరంగా ఉంది. ఢిల్లీ మార్కెట్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 6తగ్గి రూ. 46,123కు చేరింది. క్రితం ట్రేడ్ లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 46,129 వద్ద ముగిసింది. కాగా, వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్ లో కిలో వెండి రూ. 515 తగ్గి 61,821కి చేరింది. క్రితం ట్రేడ్ లో కిలో వెండి ధర రూ. 62,336 వద్ద ముగిసింది.