
గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయ మార్కెట్ లో బంగారం ధర 330 రూపాయలు తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర 49,900 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 45,750 రూపాయలకు చేరింది. పసిడి కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచిది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పతనం కావడం గమనార్హం.
నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశీయ మార్కెట్ లో వెండి ధర 300 రూపాయలకు పైగా తగ్గగా కేజీ వెండి ధర 66,200 రూపాయలుగా ఉంది. ఢిల్లోలో కిలో వెండి ధర 66,200 రూపాయలుగా ఉండగా హైదరాబా, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 70,700 రూపాయలుగా ఉంది. నాణేల తయారీదారుల నుంచి, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు భారీగా తగ్గాయని తెలుస్తోంది.
దేశీయ మార్కెట్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గడం గమనార్హం. ఔన్స్ బంగారం ధర 0.65 శాతం తగ్గి 1833 డాలర్లకు క్షీణించగా వెండి ధర 1 శాతం క్షీణతతో 25.13 డాలర్లకు తగ్గడం గమనార్హం. బంగారం ధరపై వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయి. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి.
పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం, దేశీయ మార్కెట్ లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా క్రమంగా దిగొస్తూ ఉండటం గమనార్హం.