
తెలుగు నాట వ్యవహారికి భాషోద్యమానికి మూలపురుషుడైన గిడుగు రామ్మూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకొంటున్న ప్రపంచంలోని తెలుగువారందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు, సంస్కృతానికి తేడా తెలియని వైకాపా పాలనలో గిడుగు ఆకాంక్షలు నీరుగారిపోతున్నాయని చంద్రబాబు ఆదేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం నుంచి అమ్మ భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వారిపైనా ఉందన్నారు.