Telugu News » Ap » Ghora road accident in prakasam district 3
Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లు పాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారంతా సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువులో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరువడానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కలుజువ్వలపాడు వద్ద ప్రమాదవశాత్తు ఆటలో నుంచి జారిపడ్డారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.