
సీఎం కేసీఆర్ పై ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ఫైర్ అయ్యారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ ను కంటికి రెప్పలా కాపాడుకున్నామన్నారు. ఉద్యమం ఆకాంక్ష ఏంటో ఉద్యమ సహచరుడు కేసీఆర్ గుర్తుతెచ్చుకోవాలని సూచించారు. చంద్రబాబు మంత్రి పదవి పీకేస్తే ట్రాన్పోర్ట్ భవన్లో ఏడుస్తున్న కేసీఆర్ ను ఓదార్చించి తానేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట ఉప ఎన్నిక సందర్భంగా నక్సలైట్ల బారి నుంచి కేసీఆర్ ప్రాణాలను కాపాడామన్నారు.