
తెలంగాణలోని 14 తపాలా కార్యాలయాల్లో పాస్ పోర్టు సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు తపాలాశాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ వెల్లడించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ కారణంగా తపాలా కార్యాలయాల్లో నిలిచిపోయిన పాస్ పోర్టు సేవలు ఈనెల 10 నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తపాలా కార్యాలయాల ద్వారా 41,921 మందికి పాస్ పోర్టు సేవలు అందించినట్లు రామకృష్ణ వెల్లడించారు.