
కొత్త సాగు చట్టాలపై చర్చల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శనివారం చెప్పారు. ఈ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో నిర్వహిస్తున్న నిరసనలను విరమించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో తోమర్ ఈ విజ్ఞప్తి చేశారు.