
విశాఖ జిల్లా వి. మాడుగుల మండలం జాలంపల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతోపాటు వెళ్లి ప్రమాదవశాత్తు పెద్దరేవు ఊబిలో చిక్కుకున్నారు. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందినవారు. గల్లంతైన వారిలో నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్నీ (10), వంత్తాల షర్మిల (7) వంత్తాల ఝాహ్నవి (11) ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.