Nigeria: నైజీరియాలో మోక్వా సిటీలో సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. దాదాపు 700 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 200 కు పైగా మృతదేహాలను గుర్తించగా, మరో 500 మంది ఆచూకీ గల్లంతైంది. వీరంతా కూడా వరదల్లో కొట్లుకుపోయి చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రెస్య్కూ టీం బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.