
తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఐదుగురిని కరోనా కాటేసింది. గ్రామానికి చెందిన సుందర బ్రహ్మయ్య (78) ఆయన సోదరుడు సుందర రామచంద్రరావు (70) ఆదివారం ఉదయం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. వెంటవెంటనే సోదరులిద్దరకీ అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. పది రోజుల కిందట సుందర బ్రహ్మయ్య కుమారుడు శ్రీను కరోనాతో మరణించాడు. నాలుగు రోజులకు రామచంద్రరావు భార్య, ఆయన అత్త కన్నుమూశారు. ఒకే కుటుంబంలో వరుస మరణాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.