
ఇరాక్ లోని ఓ కరోనా దవాఖానలో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో 23 మంది చనిపోయారు. రాజధాని బాగ్దాద్ శివార్ల లోని ఇబ్న్ అల్ ఖతిబ్ దవాఖానలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో ఉన్న 23 మంది అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను అదపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు.