
పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రూ. లక్షల విలువ చేసే వస్తువుల చోరీ కేసులో వారిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డులో సభ్యుడైన రత్నదీప్ మన్నా చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సువేందు అధికారి, కంతి మున్సిపాలిటీ మాజీ చీఫ్ అయిన ఆయన సోదరుడు సౌమేందు ఆదేశాల మేరకు కొంత మంది కంతి మున్సిపల్ కార్యాలయం నుంచి లక్షల విలువ చేసే పునరావాస వస్తువులు బలవంతంగా తీసుకెళ్లారని మన్నా ఫిర్యాదులో పేర్కొన్నారు.