
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిపై కేసు నమోదైంది. సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. సోమిరెడ్డి పై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో కేసులు పెట్టారు. ఐటీ చట్టం కిందా ఆయనపై కేసు నమోదు చేశారు. సెశ్రిత, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై శనివారం సోమిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు కాకాణి కుట్ర చేశారని ఆరోపించారు.