
ప్రముఖ చెఫ్, మళయాళ సినీ నిర్మాత ఎంవీ నౌషద్ (55) శుక్రవారం మరణించారు. ఇన్ఫెక్షన్ బారినపడి చికిత్స పొందుతున్న నౌషద్ కు గత 18 నెలలుగా పలు సర్జరీలు జరిగాయి. చెఫ్ గా పేరుప్రఖ్యాతులు గడించిన నౌషద్ కు కేరళలో ప్రముఖ కేటరింగ్ రెస్టారెంట్ చైన్ వ్యాపారాలున్నాయి. ఇక 2004 లో మమ్ముట్టితో ఆయన నిర్మించిన కజ్ చ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆయన పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమైన కుకింగ్ షోస్ లోనూ వీక్షకులను తనదైన వంటలతో అలరించారు.