FIFA World Cup : ఫిఫా కప్ మొదలైన తర్వాత.. అందరి దృష్టి ఆటగాళ్ల ఆట తీరు మీద ఉంటుంది. కానీ కొందరు మాత్రం వేరే అంశాల మీద దృష్టి పెడతారు. ఎవరు గెలుస్తారు.. ఎవరు ఎక్కువ గోల్స్ చేస్తారు.. ఎవరు అద్భుతమైన ప్రతిభ చూపిస్తారు.. ఏ జట్టు ఓడిపోతుంది.. అనే అంశాలపై పదే పదే చర్చ సాగిస్తూ ఉంటారు. దీనికోసం అత్యంత ఆధునికమైన వ్యవస్థలను ఉపయోగిస్తారు.
ఆధునికమైన వ్యవస్థలు ఆట తీరును మాత్రమే చెప్పగలుగుతాయి. అంతిమ ఫలితాన్ని ముందుగానే వెల్లడించలేవు. అంచనా మాత్రమే చెబుతాయి. వీటి ఆధారంగానే కోట్ల వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. అందువల్లే అంచనాలు మీడియాలో విస్తృతంగా వ్యాప్తిలో ఉంటాయి. అయితే ఈసారి ఫిఫా వరల్డ్ కప్ కు సంబంధించి సూపర్ కంప్యూటర్ అంచనా పూర్తిగా తప్పింది. ఫ్రాన్స్ జట్టు విజేతగా నిలుస్తుందని ఆస్టా సూపర్ కంప్యూటర్ ఓటు వేసింది. పైగా ఫ్రాన్స్ జట్టు గెలవడానికి 57.7% అవకాశం ఉందని ప్రకటించింది.
సెమి ఫైనల్లో ఫ్రాన్స్ మీద స్పెయిన్ గెలిచింది. అంతేకాదు టూర్ నుంచి తప్పుకుంది. మరోవైపు ఈరోజు ఇంగ్లాండ్, అర్జెంటీనా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే. . ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ (56.15 శాతం) కు ఎక్కువ ఛాన్సులు ఉన్నాయని చెబుతోంది. దీంతో విజేత ఎవరనేది చర్చనీయాంశంగా మారింది ఈసారి కప్ కొట్టాలని ఫ్రాన్స్ జట్టు స్టార్ ఆటగాడు ఎంబాపే.. పోర్చుగల్ జట్టు ఆటగాడు రోనాల్డో.. బ్రెజిల్ జట్టు ఆటగాడు నెయ్ మార్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్లేయర్లకు నిరాశ ఎదురు కావడంతో.. ఫిఫా కప్ లో అంచనాలు తారుమారయ్యాయి. దీంతో ఈసారి స్పెయిన్ తో పోటీపడే జట్టు ఇంగ్లాండ్ లేదా అర్జెంటీనా అనేది మరికొద్ది గంటల్లో తేలుతుంది. ఆ తర్వాత విజేత ఎవరనేది ఫైనల్ మ్యాచ్లో తేలుతుంది.
ఈసారి ఫిఫా కప్ లో అంచనాలు మొత్తం మారిపోయాయి. పెద్ద పెద్ద ప్లేయర్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోయారు. మైదానంలో సత్తా చూపించలేకపోయారు. ఫలితంగా పేరుపొందిన జట్లు కీలక దశలో ఇంటికి వెళ్లిపోయాయి. సంచలనాలకు కేంద్ర బిందువులుగా నిలిచిన జట్లు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈసారి ఫిఫా వరల్డ్ కప్ లో విజేతగా నిలిచే జట్టు ఏదో తెలియడం లేదని ఫుట్ బాల్ విశ్లేషకులు చెబుతున్నారు.
image.png
