MS Dhoni : ధోని.. ఈ రెండు అక్షరాల పేరు భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే అతడు టీమిండియా కు విజయవంతమైన సారధిగానే కాకుండా.. అంతర్జాతీయంగా సరికొత్త గుర్తింపు తీసుకొచ్చాడు. టి20 వరల్డ్ కప్ అందించాడు. వన్డే వరల్డ్ కప్ దక్కేలా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. ఒకవేళ ధోని ఉన్నప్పుడు ఐసీసీ గనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తే టీమిండియా కచ్చితంగా విజేతగా నిలిచేది. ఎందుకంటే అతడి నాయకత్వం అలా ఉంటుంది మరి.. ఆటగాడిగా.. నాయకుడిగా అతడు ద్విముఖ పాత్రను పోషించేవాడు. తోటి ప్లేయర్లలో స్ఫూర్తి నింపేవాడు.
ధోనీ ని జాతీయ క్రికెట్ జట్టులో మిస్టర్ కూల్ అనిపిస్తుంటారు.. టీమ్ ఇండియా మీద అతడు వేసిన ముద్ర అటువంటి మరి. ఏమాత్రం ఆవేశపడకుండా.. ఏమాత్రం తోటి ప్లేయర్ల మీద ఆగ్రహం వ్యక్తం చేయకుండా విజయం లేదా అపజయం.. ఇలా ఏవి వచ్చినా సరే ధోని నిశ్శబ్దంగా ఉండేవాడు. తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అందువల్ల టీమిండియా ఆ స్థాయిలో విజయాలు సాధించింది. వాస్తవానికి ఒక నాయకుడికి కావాల్సిందే ఆగ్రహం.. ఆవేశం కాదు.. కేవలం ఆలోచన.. స్ఫూర్తివంతమైన ప్రణాళిక.. వీటిని నూటికి నూరు శాతం అమలుచేసి టీం ఇండియాకు సానుకూలమైన ఫలితాలు వచ్చే విధంగా చేశాడు ధోని.
ధోని క్రికెట్ ఎలా అయితే ఆడతాడో.. ఫుట్ బాల్ కూడా అదే విధంగా చూస్తాడు. పైగా అతడికి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం. అనేక సందర్భాలలో ధోని ఫుట్ బాల్ మ్యాచ్ లు వీక్షిస్తూ ఆస్వాదించేవాడు. ఈ నేపథ్యంలో అతడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఫిఫా వరల్డ్ కప్ అఫీషియల్ హ్యాండిల్ ఇన్ స్టా గ్రామ్ లో ప్రత్యేకమైన పోస్ట్ చేసింది. వరల్డ్ కప్ లో ప్రస్తుతం స్టార్ ప్లేయర్లు మెస్సి, ఏం బాపే.. హాలాండ్ తలా ఏడు గోల్స్ చేసి టాప్ స్థానంలో ఉన్నారు.. సెవెన్ గోల్స్ తల ఫర్ ఏ రీసన్ అని అంటువారి ఫోటోతో పోస్టర్ షేర్ చేసింది.. హ్యాపీ తలా డే అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. మరో వైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా సోషల్ మీడియాలో ధోనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ధోని అభిమానులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోషల్ మీడియాలో వీడియోలు.. కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ధోని నాయకత్వానికి.. ధోని సామర్థ్యానికి లభించిన గౌరవం ఇది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ధోని ప్రస్తుతం 40+ సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటికీ అతడు ఐపిఎల్ లో చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. ఇటీవల సీజన్లో అతడు ఆడలేక పోయినప్పటికీ.. అతడి రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. పైగా అతడు ఆడతాడని చెన్నై అభిమానులు భావించారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో అతడు బ్యాట్ పట్టుకోలేదు.. వికెట్ల వెనకాల ఉండి కీపింగ్ చేయలేదు. చివరి మ్యాచ్లో మాత్రం మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. తోటి ప్లేయర్లతో కలిసి ఫోటోలు దిగాడు.
