
సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాదయాత్రకు తెరాస ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందని విమర్శించారు. ప్రజలను భయంభ్రాంతులకు గురిచేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఆదేవిధంగా తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదని.. ధర్మాన్ని న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని పేర్కొన్నారు.