
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 25న పంజాబ్ బంద్‌కు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ నిరసనకు 31 రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. దేశంలో అత్యదికంగా వ్యవసాయం చేస్తున్న పంజాబ్‌లో మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభించారు.