
రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమపై వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈనెల 30 వరకు మాఫీ చేస్తారు. 6,06,811 మంది రైతులకు రూ. 2005.05 కోట్లు మాఫీ చేయనున్నారు. ఇప్పటికే తొలి విడతలో భాగంగా రూ. 25 వేలలోపు రుణాలను 2.96 లక్షల మంది రైతులకు రూ. 408.38 కోట్లు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.