
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఫారెస్ట్ గంప్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కోనసీమలో జరుగుతోంది. అల్లవరం మండలం కోడూరు పాడులో ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కోనసీమ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమీర్ ఖాన్ కు చిరుసత్కారం జరగగా, ఆ తర్వాత ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. ఆమిర్ వచ్చాడని తెలిసి ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వారందరికి ఆమిర్ అభివాదం చేశాడు. వారం రోజుల పాటు కోనసీమలో చిత్ర షూటింగ్ చేయనున్నాడు దర్శకుడు అద్వైత్ చందన్.