https://oktelugu.com/

MAA Election: అభిమాని ప్రయత్నం.. బాధ కలిగిస్తోందని ప్రకాశ్ రాజ్ ట్వీట్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాశ్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ ఆయన అభిమాని పాదయాత్ర చేపట్టాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కోలమూరు ప్రాంతానికి చెందిన రంజిత్ కుమార్ మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ కోలమూరు నుంచి హైదరాబాద్ కు 485 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టాడు. కాగా రంజిత్ చేస్తోన్న పాదయాత్ర గురించి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ తాజాగా ట్వీట్ చేశారు. రంజిత్ తిరిగి ఇంటికి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : August 19, 2021 / 10:57 AM IST
    Follow us on

    మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాశ్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ ఆయన అభిమాని పాదయాత్ర చేపట్టాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, కోలమూరు ప్రాంతానికి చెందిన రంజిత్ కుమార్ మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ విజయం సాధించాలని కోరుతూ కోలమూరు నుంచి హైదరాబాద్ కు 485 కి.మీటర్ల పాదయాత్ర చేపట్టాడు. కాగా రంజిత్ చేస్తోన్న పాదయాత్ర గురించి తెలుసుకున్న ప్రకాశ్ రాజ్ తాజాగా ట్వీట్ చేశారు. రంజిత్ తిరిగి ఇంటికి వెళ్లిపొమ్మని సూచించారు. అంతేకాకుండా త్వరలోనే వ్యక్తిగతంగా కలుస్తానని మాటిచ్చారు.