https://oktelugu.com/

Minor Love: ప్రేమ పేరుతో 13 ఏళ్ల బాలికతో శృంగారం.. చివరికి ట్విస్ట్

13 ఏళ్ల వయసు.. తెలిసీ తెలియని మనసు… మాయమాటలు.. ఆకర్షణతో బతుకు బరువు. ప్రేమ(Love) పేరుతో వంచన. మాయదారి గర్భం. ఏం జరుగుతుందో తెలియని ప్రాయం. అయినా వయసు చేసింది గాయం. బాలికను(Minor Girl) ప్రేమిస్తున్నానంటూ ఓ 23 ఏళ్ల యువకుడు వెంటపడి చివరికి లోబరుచుకుని కోరిక తీర్చుకున్నాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఆమె గర్భం దాల్చింది. కడుపు నొప్పి అని ఆస్పత్రికి వెళితే అసలు విషయం బయటపడింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 19, 2021 / 10:58 AM IST
    Follow us on

    13 ఏళ్ల వయసు.. తెలిసీ తెలియని మనసు… మాయమాటలు.. ఆకర్షణతో బతుకు బరువు. ప్రేమ(Love) పేరుతో వంచన. మాయదారి గర్భం. ఏం జరుగుతుందో తెలియని ప్రాయం. అయినా వయసు చేసింది గాయం. బాలికను(Minor Girl) ప్రేమిస్తున్నానంటూ ఓ 23 ఏళ్ల యువకుడు వెంటపడి చివరికి లోబరుచుకుని కోరిక తీర్చుకున్నాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే ఆమె గర్భం దాల్చింది. కడుపు నొప్పి అని ఆస్పత్రికి వెళితే అసలు విషయం బయటపడింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. ఈ నేపథ్యంలో జరిగిన పన్నాగంలో బాలిక ప్రమిద అయిపోయింది.

    నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక బోధన్ లోని గురుకుల పాఠశాలలో ఏఢవ తరగతి చదువుతోంది. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడడంతో ఆమె ఇంటివద్దే ఉంటోంది. అందే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లి వచ్చి ఇప్పుడు ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట పడి వేధించేవాడు. చివరికి తన వలలో వేసుకున్నాడు. తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది.

    ఈ నేపథ్యంలో కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో కడుపులో గడ్డలు కావచ్చనే అనుమానంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో ఆశ్చర్యపోయిన తల్లిదండ్రులు జరిగిన పరిణామానికి హతాశులయ్యారు. ఎవరిది పాపమని ఆరా తీశారు. బాలికను సఖీ టీం బృందం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు. దీంతో వారు బాలిక నుంచి వివరాలు సేకరించారు.

    బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. అయితే అత్యాచారం చేసింది ముందుగా ఓ పాస్టర్ అనే అనుమానంతో విచారణ చేపట్టారు. కానీ చివరికి అసలు నిజం తెలియడంతో సదరు యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.