
స్టైలిష్ స్టార్ అర్జున్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న పుష్ప లో సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం మలయాన్ కుంజు సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా ఆయనకు పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మలయాన్ కుంజు సినిమా చిత్రీకరణ జరగుతున్న సమయంలో ఫహద్ ఫాజిల్ చాలా ఎత్తు నుంచి కింద పడిపోయాడు. ఈ యాక్సిడెంట్ తన ముక్కుకు గాయం కావడంతో మూడు కుట్లు వేశారని, నొప్పి మానడానికి కాస్త సమయం పడుతుందన్నాడు.