
నిరుద్యోగులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. పదో తరగతి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్టాఫ్ కారు డ్రైవర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగాలకు పోస్టల్ శాఖ దరఖాస్తు గడువును జూన్ 25వ తేదీ వరకు పొడిగించింది. చెన్నైలోని మెయిల్ మోటార్ సర్వీసులో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం మే 26 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. https://www.indiapost.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మాట్ ప్రకారం దరఖాస్తులను పూర్తి చేసి అవసరమైన ఫార్మాట్ ను జత చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులకు అవసరమైన డాక్యుమెంట్స్ ను జత చేసి జూన్ 25వ తేదీలోగా స్పీడ్‌పోస్ట్‌లో పంపాలి. స్పీడ్ పోస్టు ద్వారా వచ్చిన దరఖాస్తుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇతర పద్ధతుల్లో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.