
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కడియాలకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ ఆర్ కనస్ట్రక్షన్ కంపెనీ కంకర రాళ్ల క్వారీ నుంచి రాయి వచ్చి తగలడంతో ఓ వ్యవసాయ కూలీ చనిపోయాడు. క్వారీకి సమీపంలోని తోలటో మామిడి కాయలు కోసేందుు కూలీలొచ్చారు. వీరు మామిడితోటలో ఉన్న సమయంలో క్వారీలో పేలుడు జరుగుతుందని సమాచరం ఇచ్చారు. దీంతో కూలీలు ట్రాక్టర్ లో బయలు దేరుతున్న సమయంలోనే క్వారీలో పేలుడు జరిగి ఓ రాయి దూసుకు వచ్చింది. జహీర్ అనే వ్యక్తికి బంలంగా రాయి తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.