
మజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరనున్నారు. అదే రోజు ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నారు.