
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఉదయం పదిగంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న ఈటల భవిష్యత్ కార్యాచరణను వెల్లడించనున్నారు. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ కు రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనెల 8లేదా 9న తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈటలతోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ సహా మరికొందరు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.