
మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ ప్రజాదీవెన పాదయాత్ర హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభమైంది. కమలాపూర్ మండలం బత్తినవారిపల్లె నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరారు. అంతకముందు ఈటల సతీమణి జమున, మాజీ జడ్పీ ఛైర్మన్ తుల ఉమ వీరతిలకం దిద్ది మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో భాజపా నేతలు వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.