
తన బర్తరఫ్ తెలంగాణ రాష్ట్రానికి అరిష్టమని, కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకుంటానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ ఓడిపోవాలని ఉందని ఆయన తెలిపారు. ఎన్నికల సంఘం కేసీఆర్ ఆధీనంలో ఉండదన్నారు. అది ఢిల్లీలో ఉంటుందని చెప్పారు. కేసీఆర్ నచ్చిన పోలింగ్ ఆఫీసర్లను వేస్తే ఊరుకోనన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అయిపోగానే తెలంగాణ అంతా తిరుగతానని పేర్కొన్నారు.