https://oktelugu.com/

షాకింగ్ విషయం చెప్పిన తమన్నా !

అమ్మాయిలకు సహజంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మొటిమలు, మచ్చలు నుండి తప్పించుకోవడానికి రకరకాల సబ్బులు, క్రీమ్స్ పై యుద్ధం చేస్తుంటారు అమ్మాయిలు. సాధారణ అమ్మాయిలే వీటి పై అంతగా కలత చెందితే.. మరి సినిమా హీరోయిన్స్‌ ఎలా రియాక్ట్ అవ్వాలి ? అందుకే చాల మంది హీరోయిన్లు లక్షలు ఖర్చు పెట్టి.. ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు. ఐతే అందానికే కేరాఫ్ అడ్రెస్ లాంటి మిల్కీ బ్యూటీ తమన్నా […]

Written By:
  • admin
  • , Updated On : June 20, 2021 / 06:36 PM IST
    Follow us on

    అమ్మాయిలకు సహజంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ మొటిమలు, మచ్చలు నుండి తప్పించుకోవడానికి రకరకాల సబ్బులు, క్రీమ్స్ పై యుద్ధం చేస్తుంటారు అమ్మాయిలు. సాధారణ అమ్మాయిలే వీటి పై అంతగా కలత చెందితే.. మరి సినిమా హీరోయిన్స్‌ ఎలా రియాక్ట్ అవ్వాలి ? అందుకే చాల మంది హీరోయిన్లు లక్షలు ఖర్చు పెట్టి.. ఫారిన్‌ బ్రాండ్‌ కాస్టోటిక్స్‌ లేదా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వాడతారు.

    ఐతే అందానికే కేరాఫ్ అడ్రెస్ లాంటి మిల్కీ బ్యూటీ తమన్నా ఏమి వాడుతుందో తెలుసా ? తన అందమైన ముఖం పై ఎలాంటి మొటిమలు రాకుండా నివారించడానికి ఉమ్మి వాడుతుందట. అబ్బా.. వినడానికి చాల ఇబ్బందిగా ఫీల్ అయినా.. ఈ షాకింగ్‌ వ్యవహారాన్ని స్వయంగా తమన్నానే సగర్వంగా చాటి చెప్పింది.

    తాజాగా మిల్కీ బ్యూటీ ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా స్కిన్‌ కేర్‌ విషయంలో నేను చాల ఐటమ్స్‌ వాడతాను. అయితే మార్నింగ్ సెలైవాను కూడా వాడుతాను. ఉదయాన్నే లేచిన తర్వాత నా లాలాజాలం(సలైవా)ను నా స్కిన్ పై అప్లై చేస్తాను. ఎందుకంటే సలైవా స్కిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడంలో చాలా బాగా పని చేస్తోంది.

    మొత్తానికి మొహానికి ఉమ్మి పూస్తాను అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఈ భారీ బ్యూటీ కొత్త సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎఫ్ 3లో హద్దులు మీరి మరి నటించబోతుంది. అలాగే ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో సినిమాలోనూ తమన్నా ఓ బోల్డ్ క్యారెక్టర్ తో యూత్ ను ఆకట్టుకోవడానికి సన్నద్ధం అవుతుంది.

    అన్నట్టు మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ఆల్ రెడీ సంబంధాలు కూడా చూస్తోందట. ఇటీవల చేసిన సినిమాలతో తమన్నాకు మళ్ళీ నిరాశే మిగిలింది. అసలుకే అవకాశాలు తగ్గాయి. అందుకే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆరాట పడుతుంది.