
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. 11 గంటలకు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి మొదటిసారి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. ముఖ్యనేతలతో మాజీమంత్రి సమావేశంకానున్నారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీ కండువాకప్పకున్నారు.