England vs Argentina : ఫిఫా కప్ చివరి అంచెకు చేరుకుంది. ఇప్పటికే స్పెయిన్ ఫైనల్ వెళ్ళిపోయింది. తిరుగులేని ఆటతీరుతో అదరగొట్టింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఫైనల్ లో ఢీకొట్టేందుకు ఏ జట్టు వెళ్తుందో చూడాల్సి ఉంది. సెమి ఫైనల్ లో స్పెయిన్ గెలిచిన నేపథ్యంలో.. ఆ జట్టు ఫైనల్ మ్యాచ్లో ఢీకొట్టడానికి ఇంగ్లాండ్, అర్జెంటీనా సిద్ధంగా ఉన్నాయి.
ఇంగ్లాండ్ , అర్జెంటీనా సెమీఫైనల్ లో తలపడబోతున్నాయి. ఈ అర్ధరాత్రి 12 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.. అయితే ఇప్పటివరకు ఈ రెండు జట్లు 14 సార్లు పోటీపడ్డాయి. ఇంగ్లాండ్ ఆరుసార్.. అర్జెంటీనా మూడుసార్లు విజయం సాధించాయి. ఐదుసార్లు మ్యాచులు డ్రా అయ్యాయి. అర్జెంటీనాలో మెస్సి తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. అందరి కళ్ళు అతని మీదనే ఉన్నాయి. ఈ టోర్నీలో అతడు అద్భుతంగా రానిస్తున్నాడు . సెమీ ఫైనల్ మ్యాచ్లో అతడు గనుక అదరగొడితే.. అర్జెంటీనా జట్టుకు తిరుగుండదు.
అర్జెంటీనా జట్టు భారాన్ని మెస్సీ మోస్తున్నాడు.. సెమీ ఫైనల్ మ్యాచ్లో అతడు అదే మ్యాజిక్ కొనసాగిస్తే అర్జెంటీనా జట్టుకు ఎదురు ఉండదు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు తిరుగులేని స్థాయిలో ఆట కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్లో మెక్సికో జట్టు మీద అద్భుతంగా ఆడింది.. ఏకంగా సెమీఫైనల్ దాకా వచ్చింది. ఆ జట్టు లో సమిష్టి తత్వం ఎక్కువగా ఉంది. ఎటాకింగ్.. డిఫెన్స్.. లో ఆ జట్టు ఆటగాళ్లు అదరగొడుతున్నారు.
రెండు జట్లలో బలమైన ప్లేయర్లను నేపథ్యంలో పోటీ బీభత్సంగా సాగే అవకాశం కనిపిస్తోంది. అందరికండ్లు మెస్సి మీద ఉన్నప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టులోను సూపర్ ప్లేయర్లు ఉన్నారు. ఇప్పటివరకు ఈ టోర్నీలో ఈ రెండు జట్లు అద్భుతమైన ప్రదర్శన చేశాయి. సెమీ ఫైనల్ మ్యాచ్ నరాలు కట్ అయ్యేవిధంగా సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు హాట్ కేకుల మాదిరి అమ్ముడుపోయాయి. ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ.. బీరు తాగడం చాలామంది అభిమానులకు అలవాటు. సెమి ఫైనల్ మ్యాచ్లో కూడా రికార్డ్ స్థాయిలో ముందస్తుగానే బీర్ల విక్రయాలు ఆన్లైన్లో సాగిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. పిజ్జాలు.. శాండ్ విచ్.. బర్గర్లు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి.. ఆటగాళ్ల పోరాటం.. అభిమానుల ఆరాటంతో సెమి ఫైనల్ మ్యాచ్ బీభత్సంగా సాగే అవకాశం ఉంది.
