
లార్డ్స్ టెస్టుల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల చర్య వివాదాస్పాదమైంది. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా వాళ్లు షూస్ స్పైక్స్ తో బంతిని తొక్కడం కెమెరా కంటపడింది. ఎవరో తెలియదు కానీ లంచ్ తర్వాత ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు బంతిని అటు ఇటూ తంతూ దానిపై స్పైక్స్ తో ముద్రలు వేయడం కనిపించింది. ఈ దృశ్యాలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యాయి. టీమ్ ఇండియా మాజీ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా స్పందించారు. అసలేం జరుగుతోంది. ఇది బాల్ టాంపరింగా లేదా కరోనా నివారణ చర్యా అని ఓ నవ్వుతున్న ఎమోజీని జోడిస్తూ అతడు ట్వీట్ చేశాడు.