
విశాఖపట్నం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పై అసిస్టెంట్ కమిషనర్ ఇసుక చిమ్మిన వివాదానికి అధికారులు ముగింపు పలికారు. వృత్తిపరంగా డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ కఠినంగా వ్యవహరించి ఇబ్బంది పెట్టారని.. ఇది భరించలేక అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక చల్లరని, ఇందులో ఇద్దరి తప్పూ ఉందని తేల్చారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఇద్దరినీ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ఉన్నాతాధికారులు.