
కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు పూచీకత్తు లేకుండా రూ. 5లక్షల మేరకు రుణం ఇస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కొవిడ్-19 చికిత్స కోసం రూ. 5లక్షల మేరకు రుణం ఇవ్వాలని ఆయా బ్యాంకుల పాలకమండళ్లు ఒక విధానంగా తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే ఏపీలో 2,791 మంది, తెలంగాణలో 3,389 మంది ఈ రుణాలు పొందినట్లు మంత్రి తెలిపారు.